తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. శోభాయాత్రలో భాగంగా బంగారు కవమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపురరం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు. ప్రధాన ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజలు నిర్వహించనున్నారు. కుటుంబసమేతంగా కేసీఆర్ స్వామివారిని దర్శించుకోనున్నారు. యాదాద్రి క్షేత్రాభివృద్ధికి కృషి చేసిన వారిని సీఎం కేసీఆర్ సన్మానించనున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాదాద్రిలో కన్నుల పండువగా శోభాయాత్ర : పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
Advertisement
తాజా వార్తలు
Advertisement