Wednesday, September 25, 2024

ఎమ్మెల్యేగా అత్యంత వ‌యోవృద్ధుడు..నాలుగ‌వ‌సారి గెలిచిన శివ శంక‌ర‌ప్ప‌

వ‌రుస‌గా నాలుగ‌వ‌సారి ఎమ్మెల్యేగా గెలిచారు అత్యంత వయోవృద్ధుడైన శివశంకరప్ప.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో మరోసారి జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ నేత అయిన 92ఏళ్ల శివశంకరప్ప దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన వయోవృద్ధుడిగా రికార్డు సృష్టించారు. శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2008 నుంచి దావణగెరె దక్షిణ నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరసగా నాలుగోసారి గెలుపొందారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో శంకరప్పకు పోటీగా బీజీపీ బీజీ అజయ్‌కుమార్‌ను నిలబెట్టింది. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలకు అజయ్‌కుమార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు మరోసారి శివశంకరప్పకే పట్టం కట్టారు. దీంతో జీజేపీ వ్యూహం బెడిసికొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement