కిట్టీ పార్టీ కేసులో శిల్పా చౌదరికి బెయిల్ లభించింది. దివ్యారెడ్డి ఫిర్యాదు చేసిన కేసులో శిల్పాకి బెయిల్ మంజూరు అయింది. కాగా మరో రెండు కేసుల్లో శిల్పకు బెయిల్ లభించలేదు. దాంతో ఇంకా శిల్పచౌదరి జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. చిట్టీలు మొదలు.. కిట్టీ పార్టీల వరకు అనేక రంగాల్లో వేలు పెట్టిన శిల్పపై అనేక ఆరోపణలున్నాయి. తమకు ఎక్కువ మొత్తాల్లో డబ్బులు చెల్లించాలంటూ అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా నోరు విప్పలేదు శిల్ప. పోలీసుల కంటే అడ్వాన్స్‌గా ఆలోచించిన శిల్పా, అసలు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడింది. శిల్పాచౌదరిని బ్యాంకుకు తీసుకెళ్లారు పోలీసులు. అక్కడ అమెకు సంబంధించిన లాకర్ ఓపెన్ చేసి అవాక్కయ్యారు. అందులో డబ్బు, బంగారం ఏమీ లేవు. ఏదో ఉన్నాయని ఊహించిన పోలీసులకు నిరాశే ఎదురైంది. దీంతో చేసేదేం లేక, శిల్పాచౌదరిని తిరిగి SOT కార్యాలయానికి తరలించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..