అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 167పరుగుల లక్ష్యాన్ని 17.4ఓవర్లలోనే ఛేదించింది. శిఖర్ ధావన్ 69, పృథ్వీ షా 39 రన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా ఆరు విజయాలతో మరోమారు అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ వన్‌మ్యాన్ షోతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 58 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 99 పరుగులు చేశాడు. శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు.
అనంతరం 167 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ కేపిటల్స్ 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు పృథ్వీషా (39), శిఖర్ ధవన్ (69, నాటౌట్) గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. ఆ తర్వాత మిగిలిన పనిని స్మిత్ (24), రిషభ్ పంత్ (14), హెట్మెయిర్ (16, నాటౌట్)లు పూర్తిచేసి జట్టుకు విజయాన్ని అందించారు. పంజాబ్ జట్టు ఓడినప్పటికి అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఢిల్లీ బౌలర్లలో రబాడా 3, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ తలో వికెట్‌ను దక్కించుకున్నారు.
పంజాబ్‌ను ఓడించి అగ్రస్థానానికి ఢిల్లీ!
Advertisement
తాజా వార్తలు
Advertisement