ఎట్టకేలకు ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది ఆప్. కాగా ఆప్ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. ఈ సందర్భంగా షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ, లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. దాదాపు రెండు గంటల సేపు ప్రశాంతంగా కొనసాగిన ఓటింగ్ లో బీజేపీ అభ్యర్థి రేఖ గుప్తాను.. షెల్లీ ఒబెరాయ్ ఓడించారు. షెల్లీ 150 ఓట్లను సాధించగా రేఖకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో, షెల్లీ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే ఆప్ కౌన్సిలర్లు విజయనినాదాలు చేశారు. గత డిసెంబర్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు ఎన్నిక జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement