Monday, November 18, 2024

రెండోసారి మేయ‌ర్‌గా షెల్లీ ఒబెరాయ్.. ఆనందంలో ఆమ్ ఆద్మీ నేత‌లు

బిజెపి అభ్య‌ర్థి శిఖారాయ్ త‌న నామినేష‌న్ ను విత్ డ్రా చేసుకోవ‌డంతో ఢిల్లీ మేయ‌ర్ గా ఆమ్ ఆద్మీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ కి లైన్ క్లియ‌ర్ అయింది. దాంతో ఆమె ఢిల్లీ మేయ‌ర్ గా ఎన్నిక‌య్యారు. ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపు త‌ర్వాత ఢిల్లీకి కొత్త మేయ‌ర్ వ‌చ్చారు. ఢిల్లీలో అయిదేళ్ల పాటు మేయ‌ర్ ప‌ద‌విని రొటేష‌న్ చేస్తారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 4వ తేదీన ఢిల్లీలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. మూడు కార్పొరేష‌న్ల‌ను ఎంసీడీ పేరుతో ఒక్క‌టిగా చేశారు. వార్డుల సంఖ్య‌ను 272 నుంచి 250కి కుదించారు. స్టాండింగ్ క‌మిటీని ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఓటింగ్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు శిఖా రాయ్ తెలిపారు.
షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయ‌ర్‌గా రెండోసారి ఎన్నియ్యారు. ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన ఆమె తొలిసారి మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. అప్పుడు ఆమె రేఖా గుప్తాపై గెలుపొందారు. నేడు ఓటింగ్ స‌మ‌యంలో డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వికి బీజేపీ నుంచి పోటీప‌డ్డ సోనీ పాండే కూడా చివ‌రి నిమిషంలో త‌ప్పుకున్నారు. ఆప్‌కు చెందిన ఆలే మ‌హ్మ‌ద్ ఇక్బాల్ రెండోసారి డిప్యూటీ మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement