Friday, November 22, 2024

Something Specila: కొచ్చిలో షీ లాడ్జి.. మహిళల కోసం ప్రత్యేక లాడ్జి అందుబాటులోకి

మహిళల కోసం కొచ్చిలో ప్రభుత్వం ప్రత్యేక లాడ్జి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని మంత్రి ఎం.బి.రాజేష్ ప్రారంభించారు. 90 సింగిల్‌, డబుల్‌ బెడ్‌ రూములున్న పరమార లాడ్జిని రూ.4.8 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఓనం పండుగ కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే మహిళలు ప్రత్యేకంగా విడిది చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఈ లాడ్జిని ఏర్పాటు చేశారు. ఒంటరి మహిళలకు ఎలాంటి అభద్రత భావం కలగకుండా ఈ లాడ్జిని తీర్చిదిద్దారు.

సింగిల్‌ బెడ్‌ రూమ్‌లో ఒక టేబుల్‌, అల్మారా ఉండేలా అటాచ్‌డ్‌ బాత్‌రూమ్‌లతో నిర్మించారు. ఎక్కువ డబ్బును చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు కేవలం 150 రూపాయలు మాత్రమే.. ఎక్కువ రోజులుండే వారికి రోజుకు రూ.100లు కడితే సరిపోతుంది. అలాగే మూడు పూటలా భోజన సదుపాయం. అది కూడా కేవలం రూ.10లకే. భోజన పథకాన్ని ప్రభుత్వం సమృద్ధి పథకం ద్వారా అందించనుంది. కొచ్చిని సందర్శించే మహిళలు కూడా షీ లాడ్జి సేవలను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement