ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ షావోమీ ఓ వినూత్నమైన ఏసీని చైనా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇది కేవలం ఏసీ మాత్రమే కాదండోయ్..వెచ్చదనాన్ని ఇస్తుందట. కేవలం 30 సెకండ్లలోనే ఇది గది మొత్తాన్ని చల్లగా మార్చేస్తుంది. అంతేకాదు.. చలికాలంలో గదిలో వెచ్చదనం కోరుకుంటే.. నిమిషంలోనే గదిని వెచ్చగా మారుస్తుంది. 32 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ పనిచేస్తుంది. 1.5 హెచ్ పీ సామర్థ్యంతో కూడిన ఏసీ 20 చదరపు మీటర్ల విస్తీర్ణంతో కూడిన గదులకు అనుకూలమని సంస్థ ప్రకటించింది. ఈ ఏసీలో ఉన్న మరో మంచి ఫీచర్ విద్యుత్ ను చాలా వరకు ఆదా చేయడమే. అందుకే ఈ ఏసీకి ‘షావోమీ జెయింట్ పవర్ సేవింగ్ ప్రో’ అని పేరు పెట్టింది. చైనాలో ఈ ఏసీని 2,499 యువాన్ల ధరపై షావోమీ విడుదల చేసింది. భారత కరెన్సీలో రూ.29,000పైన. 3,500 వాట్స్ వరకు విద్యుత్ ను తీసుకుంటూ.. గదిని చల్లగా చేయగలదు. ఇది ఫుల్ డీసీ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్. హిటాచీ, ప్యానాసోనిక్ తో పనిచేసిన నిపుణుల సాయంతో షావోమీ ఈ ఏసీకి రూపకల్పన చేసింది. భారత్ సహా, ఇతర మార్కెట్లలో విడుదల చేసే విషయంపై షావోమీ ఇంకా ప్రకటన చేయలేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement