పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. పోలీసులపై చేయిచేసుకున్న ఆమెపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇవ్వాల (సోమవారం) ఉదయం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా మే 8 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
ఈ సందర్భంగా షర్మిలను రిమాండ్ కు ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తనపై పోలీసులు వాదనలు వినిపించారు. మరో వైపు షర్మిల న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మరికొద్దిసేపట్లో వాదనలు జరుగనున్నాయి.