Friday, November 22, 2024

రేపటి నుంచి షర్మిల పాదయాత్ర.. చేవెళ్ల నుంచి ప్రారంభం

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: తెలంగాణలో షర్మిల పాదయాత్ర తేదీలు, రూట్‌మ్యాప్‌లు ఖరారయ్యాయి. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ప్రజాప్రస్థానం యాత్ర 400 రోజులు, 4వేల కిలోమీటర్లు, 90 నియోజకవర్గాలతో పాటు, 14 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో సాగనుంది. రేపు ఉదయం చేవెళ్లలో బహిరంగ సభ అనంతరం యాత్ర ప్రారంభం కానుండగారోజుకు 10 నుంచి 15 కిలోమీటర్లు పాదయాత్ర సాగేలా ఏర్పాట్లు చేశారు. యాత్ర మధ్యలో రచ్చబండ కార్యక్రమాలుంటాయని ఆ పార్టీ ముఖ్యనేత తూడి దేవేందర్‌ తెలిపారు.

ప్రతి మంగళవారం చేపడుతున్న నిరుద్యోగ దీక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోమవారం లోటస్‌పాండ్‌లో విలేకరులతో దేవేందర్‌ మాట్లాడుతూ.. ప్రజాప్రస్థానం రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో షర్మిల నేడు ఇడుపులపాయలోని తండ్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారని చెప్పారు.

షర్మిల ఇడుపులపాయకు వెళ్తుండడంతో నేటి నిరుద్యోగ నిరాహారదీక్ష నిర్వహించడం లేదన్నారు. పాద యాత్ర ప్రతిరోజూ ఉదయం 8.30కు మొదలై మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందని తెలిపారు. పాదయాత్ర అనగానే తెలుగు రాష్ట్రాల వారికి వైయస్సార్‌ గుర్తుకొస్తారని అన్నారు.

- Advertisement -

మద్దతివ్వండి : విజయమ్మ
షర్మిల ప్రారంభించబోయే పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు వైయస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ”వైయస్సార్‌ను ప్రేమించే ప్రతి హృదయానికి, నా బిడ్డను అక్కున చేర్చుకున్న ప్రతి బిడ్డకు పిలుపు..ఈ నెల 20న చేవెళ్లలో రాజన్న సంక్షేమ అభివృద్ధి కోసం, మీ రాజన్న బిడ్డ మరో ప్రజాప్రస్థానం యాత్రలో మొదటి అడుగు వేస్తుం డగా.. మీరందరూ వచ్చి ఆశీర్వదించి.. ఆమె అడుగులో అడుగు వేసి, చేతిలో చే యి కలపండి. మీరు, ఆమె కలిసి ప్రభంజనాన్ని సృష్టించండి. రాజన్న రాజ్యం..స్వర్ణయుగాన్ని సాధించుకోండి” అంటూ వీడియోలో పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement