ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలోని ఉమ్మడి ఉగ్రవాద నిరోధక గ్రిడ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ (MAC) ద్వారా మరిన్ని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. మల్టీ ఏజెన్సీ సెంటర్ (MAC) అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పని చేసే ఉమ్మడి తీవ్రవాద నిరోధక గ్రిడ్.
కార్గిల్ చొరబాటు, కార్గిల్ రివ్యూ కమిటీ సూచన ప్రకారం మల్టీ ఏజెన్సీ సెంటర్‌ను 2001లో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ఏజెన్సీలు, పోలీసు బలగాలు సేకరించిన గూఢచార సమాచార మార్పిడికి ఇది నోడల్ ఏజెన్సీ. జాతీయ స్థాయి MAC ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఈ సెంటర్ అధికారులు రోజూ సమావేశమై సమాచారాన్ని విశ్లేషిస్తుంటారు.
MAC, Cri-MAC వేర్వేరు..
మల్టీ-ఏజెన్సీ సెంటర్ (MAC), క్రైమ్ మల్టీ -ఏజెన్సీ (Cri-MAC) రెండూ వేర్వేరు. క్రూరమైన నేరాలు, అంతర్రాష్ట్ర సమన్వయానికి సంబంధించిన ఇతర సమస్యలపై వివిధ పోలీసు బలగాల మధ్య సమాచారాన్ని పంచుకోవడానికి 2020లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ Cri-MACని ప్రారంభించింది. కాగా, ఎంఏసీ అనేది ఇంటెలిజెన్స్ బ్యరో ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక గ్రిడ్ మల్టీ ఏజెన్సీ సెంటర్.