– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
మనీలాండరింగ్ కేసులో ఎంపీ, శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అరెస్టయ్యాక ఆయన సామ్నాలో రాసిన ‘‘రోఖ్‌థోక్’’ కాలమ్ ఇప్పుడు కడక్‌నాథ్ ముంబైకర్ పేరుతో వస్తోంది. ఆ కాలమ్‌లో “అమిత్ షా మహారాష్ట్రపై పదేపదే చెడు పదజాలం వాడుతున్నారు. ఇది మహారాష్ట్రపై ఆయనకున్న ద్వేషాన్ని సూచిస్తోంది.
వాస్తవానికి ఆయన ఎప్పుడూ మహారాష్ట్ర, మరాఠీ ప్రజలకు కట్టుబడి ఉండాలి. మోడీ, షాలపై యూపీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పుడు వారు ఆ పరిస్థితుల నుంచి బయటపడేలా చేసింది మహారాష్ట్ర లీడర్లే. అది గోద్రా కేసుల్లో ఒకదానిలో షా బెయిల్‌పై విడుదలయ్యేందుకు శరద్ పవార్, మోడీ మధ్య మంచి ‘కమ్యూనికేషన్’ జరిగింది.
“ఇది అబద్ధం కాదు, నిజం. మరో సందర్భంలో అమిత్ షాకు సహాయం చేయడానికి బాలాసాహెబ్ ‘సర్కార్’ లాగా పనిచేశాడు. సంజయ్ రౌత్ మాత్రమే దీని గురించి ఎక్కువగా రాయగలరు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే దాని గురించి మరింత మాట్లాడగలరు. కానీ, అదే అమిత్ షా నేడు పవార్, థాకరేలకు వ్యతిరేకంగా తీవ్రమైన మిషన్ నడుపుతున్నారు”అని సామ్నా కథనం పేర్కొంది.