Saturday, November 23, 2024

ఎస్ ఎస్ ఎల్వీ-డీ1 విఫ‌లంపై స్పందించిన – షార్ డైరెక్ట‌ర్ రాజ రాజ‌న్

సెన్స‌ర్ స‌మ‌స్య త‌లెత్త‌డం వ‌ల్లే ఎస్ ఎస్ ఎల్వీ-డీ1 నిర్దిష్ట క‌క్ష్య‌లోకి ఉప‌గ్రహాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌లేక‌పోయింద‌ని తెలిపారు షార్ డైరెక్ట‌ర్ రాజ రాజ‌న్. 2023 ఫిబ్రవరి-జులై మధ్యలో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్ ప్రయోగం ఉంటుందన్నారు. 4 నెలల్లో 4 ప్రయోగాలు లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోందని తెలిపారు. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై షార్ డైరెక్టర్ రాజరాజన్ స్పందించారు. ఎస్ ఎస్ ఎల్వీ-డీ1 ప్ర‌యోగం విఫ‌ల‌మ‌వ్వ‌డంలో లోపాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు. సెప్టెంబరు, అక్టోబరులో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా గగన్ యాన్ ప్రయోగం చేపట్టబోతున్నామన్నారు. గగన్ యాన్ లో తొలుత మానవరహిత ప్రయోగాలు జరిపిన తర్వాతే పూర్తిస్థాయి ప్రయోగం ఉంటుందన్నారు. గగన్ యాన్ ప్రయోగానికి ఇంకా 4 ప్రధాన గ్రౌండ్ టెస్టులు జరపాల్సి ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement