తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎస్ గా శాంతికుమారి నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి గతంలో సీఎంవోలో కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ గా ఉన్నారు. ఈమె ఏప్రిల్ 2025లో రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో రేసులో ప్రధానంగా రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంతికుమారి పేర్లు వినిపించాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామకమయ్యారు. ఆమె సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement