Friday, November 22, 2024

ష‌ణ్ముఖ్, దీప్తి సున‌య‌నల బ్రేక‌ప్

ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఈ పేరు తెలియ‌ని తెలుగు రాష్ట్రాలు ఉండ‌వేమో. ఎందుకంటే రీసెంట్ గా బిగ్ బాస్5సీజ‌న్ లో ర‌న్న‌ర్ గా నిలిచాడు ష‌ణ్ముఖ్. యూట్యూబ్ స్టార్ గా ఎన‌లేని పేరుని సంపాదించాడు. కాగా దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముఖ్ గ‌త కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే బిగ్ బాస్5 ష‌ణ్ముఖ్ కి బాగా దెబ్బ తీసింది. హౌస్ లో సిరితో , ష‌ణ్ముఖ్ బాగా క‌నెక్ట్ అయ్యాడు. వీరి వ్య‌వ‌హారం ముద్దుల‌తో మొద‌లై హ‌గ్గుల వ‌ర‌కు వెళ్ళింది. కాగా సిరి తల్లి హెచ్చరించినప్పటికీ వీరి పద్ధతి మారలేదు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ కు సునయన బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.తాను, షణ్ముఖ్ ఇద్దరం మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నామని సునయన తెలిపింది.

ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయామని చెప్పింది. గత ఐదేళ్లుగా తాము సంతోషంగా ఉన్నామని.. చివరకు మీరు కోరుకున్నట్టే నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. కలిసి ఉండటానికి ఇద్దరం ఎంతో ప్రయత్నించామని, అయితే జీవితానికి ఏవి అవసరమో వాటిని విస్మరించామని తెలిపింది. తమ ఇద్దరి దారులు వేరనే విషయాన్ని తెలుసుకున్నామని… అందుకే ఇక్కడితోనే ఆగిపోకుండా ముందుకు సాగాలని భావించామని పేర్కొంది. తమ బ్రేకప్ సోషల్ మీడియాలో కనిపించినంత ఈజీ కాదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఇద్దరి ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నామని సున‌య‌న కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement