రామ మందిర నిర్మాణం కోసం సుదీర్థ న్యాయపోరాటం చేసిన ప్రముఖ హిందువుల మత గురువు శంకరాచార్య శ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూశారు. జోటేశ్వర్ జిల్లా నర్సింగపూర్‌లోని పరమహంసి గంగా ఆశ్రమంలో తుదిశ్వాస విడిచారు. శంకరాచార్య 99 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన గుజరాత్‌లోని ద్వారకా శారదా పీఠానికి, బద్రీనాథ్‌లోని జ్యోతిమఠాలకు శంకరాచార్యులుగా ఉన్నారు. ఇటీవలే హరియాలీ తీజ రోజున స్వామీజీ 99వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. స్వరూపానంద సరస్వతి హిందువులలో గొప్ప మత నాయకుడిగా పరిగణించబడ్డారు. చివరి క్షణంలో శంకరాచార్య అనుచరులు, శిష్యులు ఆయన దగ్గరే ఉన్నారు. ఆయన మరణవార్త తెలియగానే.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకున్నారు.
తుదిశ్వాస విడిచిన శంకరాచార్య శ్రీ స్వామి స్వరూపానంద సర్వస్వతి
Advertisement
తాజా వార్తలు
Advertisement