గులాబ్ తుఫాను చేసిన బీభత్సం నుంచి తేరుకునేలోపే మరో తుఫాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘షహీన్’ తుఫాను విరుచుకుపడేందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని భారత వాతవరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారినట్టు తెలిపింది. పశ్చిమ- వాయువ్యంగా గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకకు 700 కి.మీ, తూర్పు-నైరుతిగా ఇరాన్‌లో చాబర్ పోర్టకు 240కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు చెప్పింది.
అక్టోబరు 4 తెల్లవారుజామున ఒమన్ వద్ద తుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేసింది. షహీన్ ప్రభావం భారత్ పశ్చిమ తీరంలోని ఏడు రాష్ట్రాలపై ఉంటుందని హెచ్చరించింది. గుజరాత్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో షహీన్ తుఫాను కారణంగా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. అక్టోబరు 4 వరకూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇది కూడా చదవండిః హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. టీఆర్ఎస్ కు ధీటుగా రేవంత్ స్కెచ్