మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తొమ్మిదేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఒకరికి జీవిత ఖైదు విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద నిందితుడిని ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి సుమన్ శ్రీవాస్తవ దోషిగా తేల్చారు. 2019 నవంబర్ 16న ఈ ఘటన జరగ్గా నిందితుడిని రవిచంద్రగా గుర్తించారు. బాధితురాలు రావూజీ బజార్ ప్రాంతంలోని బహిర్భూమికి వెళ్లగా బాలికను చంపుతానని బెదిరించిన రవిచంద్ర ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆపై అదే ఏడాది నవంబర్ 23న బంధువుల ఇంటికి వెళ్లిన బాలికకు కడుపునొప్పి రావడంతో అసలు విషయం బయటపెట్టింది. నవంబర్ 24న బాలిక తల్లితో కలిసి రావూజీ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు రవించంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఎదట హాజరుపరిచారు.