8వ తరగతి చదువుతున్న ఆ బాలిక గర్భం దాల్చి ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ మధ్య కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు ఆమెను వెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షించిన చేసిన డాక్టర్ ఆమె గర్భణి అని తేల్చేశారు. అదే ఆసుపత్రిలో చేరిన బాలిక ఆగస్ట్ 2న మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్యాధికారులు ఈ విషయాన్ని పిల్లల సంక్షేమ కమిటీకి తెలియజేయగా వారు వెల్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. మహిళా పోలీసులు ఆ బాలికను పలు విధాలుగా ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు కాస్త బెదిరిపోయిన ఆ బాలిక తన తండ్రి పది నెలలుగా తనపై లైంగికదాడికి పాల్పడుతున్నట్లు తెలిపింది. అయితే.. తన తల్లిదండ్రులు విడిపోవడంతో సోదరుడితో కలిసి నానమ్మ ఇంట్లో ఉంటున్నట్లు తెలిపింది. నానమ్మ వండిన భోజనాన్ని తండ్రికి తీసుకెళ్లేదాన్నని, ఈ క్రమంలో తనపై అత్యాచారం చేసేవాడని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని వివరించింది. దీంతో బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమె తండ్రి అయిన 44 ఏళ్ల వ్యక్తిని వెల్లూరు మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.