Saturday, November 23, 2024

అమెరికాలో తీవ్ర తుఫాన్.. ప‌లు ప్రాంతాల్లో నిలిచిన క్రిస్ట‌మ‌స్ వేడుక‌లు

తీవ్ర తుఫాన్ కార‌ణంగా అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 19మంది మ‌ర‌ణించారు. ఈ తుఫాన్ కార‌ణంగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలకు ఈ ఏడాది క్రిస్మస్ సంబరాలు దూరమయ్యాయి. బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో కోట్లాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లలో మగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. సహాయక, పునరుద్ధరణ చర్యలకు ప్రతికూల వాతావరణం అవరోధంగా మారింది. ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో, మైనస్ 37డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. న్యూయార్క్, టెనెస్సే, వాషింగ్టన్ డీసీల్లో మైనస్ 9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. తీవ్ర ప్రతికూల వాతావరణంలో ప్రజలు పర్యటనలు, వేడుకలు రద్ధు చేసుకుని, ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా శీతాకాలంలో బలమైన తుఫాను రాక అక్కడి జనజీవనాన్ని స్తంభింపజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement