తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. అధిక ఉష్ణోగ్రతలుంటాయని ఆరెంజ్ రంగు హెచ్చరిక జారీచేసింది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో సాధారణంకన్నా ఆరేడు డిగ్రీలు అదనంగా పెరిగినందున ఎండల వేడి తీవ్రత బాగా పెరిగి ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం పగలు రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నల్గొండలో 42.4 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 5 డిగ్రీలు అధికం అని వాతావరణశాఖ స్పష్టం చేసింది. కాగా, ఈ ఏడాది మార్చిలోనే వీస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement