Saturday, November 23, 2024

Followup: సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి.. ముగ్గురిని కాపాడిన ఎస్సై

సికింద్రాబాద్‌లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్లో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూబీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బైక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇవి కొద్ది సేపట్లోనే ఇరువైపులకు వ్యాపించాయి. దీంతో రూబీ లాడ్జిలో ఉన్న ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. హోటల్లో ఇంకొంతమంది టూరిస్టులు ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు.

అయినా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పెద్ద పెద్ద శబ్దాలతో పేలుడుండడంతో త్వరగా మంటలు ఆర్పేందుకు కుదరలేదు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద సాహసమే చేశారు. హోటల్ గదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే.. అప్ప‌టికే చాలామందికి మంటలు అంటుకుని హాహాకారాలు చేస్తూ హోటల్ నుంచి కిందికి దూకేశారు. వారిలో కొంతమంది కాళ్లు రెక్కలువిరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని ఒక ఎస్సై ప్రాణాలతో కాపాడారు.

కాగా, పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో ఇంకా హోటల్లో ఎంతమంది ఉండి ఉంటారో అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు. పొగ పీల్చుకుని ఊపిరాడక ఇంకా ఎవరైనా చనిపోయారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో నలుగురి పరిస్థితి కూడా సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఎలక్ట్రిక్ బైక్ల షాపుకి పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. యజమానిపై కేసు నమోదు చేశామన్నారు.

https://epaper.prabhanews.com/home/FullPage
Advertisement

తాజా వార్తలు

Advertisement