కరోనా కట్టడిలో భాగంగా ప్రతిష్టాత్మంగా భారత్ బయోటెక్ సంస్థ బూస్టర్ డోస్ ను సిద్ధం చేస్తోంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ బూస్టర్ డోస్ ప్రయోగాలను ప్రారంభించింది. రెండో డోస్ పూర్తయ్యాక ఈ బూస్టర్ డోస్ ఇస్తే ఏర్పడే యాంటీబాడీస్ జీవితాంతం ఉంటాయని భారత్ బయోటెక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలంటూ గత నెలలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకోగా తాజాగా అనుమతి లభించింది.
ప్రస్తుతం కరోనా సోకకుండా నిరోధించేందుకు కొవాగ్జిన్ రెండు డోసులను ఇస్తున్నారు. రెండోడోస్ వేసుకున్న రెండువారాల తర్వాత శరీరంలో సంపూర్ణంగా ప్రతిరక్షకాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ప్రతిరక్షకాలు దాదాపు 9 నెలలు మానవ శరీరంలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే.. కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ పొందాలంటే ఏటా టీకాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా భారం అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ ‘బూస్టర్ డోస్’ ప్రయోగాలు చేపట్టింది. రెండోడోస్ పూర్తయ్యాక మూడోడోస్ ఇస్తే ఏర్పడే ప్రతిరక్షకాలు జీవితాంతం ఉంటాయని భారత్ బయోటెక్ భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలంటూ గతనెలలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకోగా తాజాగా అనుమతి ఇచ్చింది. దాంతో 190 మందికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఏడుగురు వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చారు. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో ప్రయోగాలు చేపడుతున్నట్టు భారత్ బయోటెక్‌వర్గాలు తెలిపాయి. 18-55 ఏళ్ల మధ్యవారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించాయి. గతంలో ఫైజర్, మోడర్నా సైతం బూస్టర్ డోస్ ప్రయోగాలు జరిపాయి. అయితే జీవితాంతం ప్రతిరక్షాలు ఉంటాయని నిర్ధారించలేకపోయాయి.