రష్యా ఈరోజు ఉదయం నుంచి ఉక్రెయిన్ పై దాడి చేస్తోంది. అయితే ఈ దాడిపై ఉక్రెయిన్ స్పందించింది. ఉక్రెయిన్పై రష్యా దళాలు చేస్తున్న బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలో ప్రధాన నగరమైన ఒడిసా శివారు ప్రాంతమైన పొడిల్స్క్ లోని సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఆరుగురు పౌరులు మృత్యువాతపడగా.. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే పోల్ సిటీపై జరిపిన దాడిలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఉక్రెయిన్పై దాడులకు పాల్పడుతున్న 50 మంది రష్యా చొరబాటుదారులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు తమ భూభాగంలోకి ప్రవేశించిన ఐదు రష్యా విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ జాయింట్ ఫోర్సెస్ కమాండ్ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital