ఐర్లాండ్ కేఫ్ తమ రెగ్యులర్ కస్టమర్ పేరుతోనే డిష్‌ను సర్వ్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇన్‌స్టాగ్రాంలో గ్రాంగ్కాన్ కిచెన్ అనే కేఫ్ ఈ వీడియోను షేర్ చేసింది. తన పేరుతో డిష్‌ను సర్వ్ చేస్తున్నారని తెలిసి కేఫ్‌లోకి జాన్ అనే వృద్ధుడు నడుచుకుంటూ రాగా కేఫ్ సిబ్బంది ఆయనకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. జాన్ కేఫ్‌లో అడుగుపెడుతూ తాను రోజూ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ను ఆర్డర్ చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. ప్లేట్లో గ్రిల్డ్ వెజిటబుల్స్, మీట్ సర్వ్ చేసి వడ్డించారు. ఈ డిష్‌ను జాన్స్ బ్రేక్‌ఫాస్ట్‌గా పేర్కొన్న కేఫ్ అదే పేరును మెనూలోనూ చేర్చింది. ఓ కస్టమర్ ఈ డిష్‌ను ఆర్డర్ చేయగా రసీదుపైనా అదే పేరు ఉండటం కనిపించింది. దాదాపు ప్రతి రోజూ జాన్ (మా బెస్ట్ కస్టమర్) మా కేఫ్‌ను సందర్శించి ఒకే బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ చేస్తారు. దీంతో ఈ డిష్‌కు జాన్స్ బ్రేక్‌ఫాస్ట్‌గా పేరు పెట్టాం..మెనూలో జాన్ తొలిసారి దీన్ని చూసిన క్లిప్ ఇదే అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఇంటర్నెట్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ క్లిప్‌కు 23,000కుపైగా లైక్స్ రాగా ఎన్నో రియాక్షన్స్ వచ్చాయి. ప్రతిరోజూ తమ కేఫ్‌కు వచ్చే కస్టమర్, పెద్దాయన పట్ల రెస్టారెంట్ అరుదైన గౌరవం కనబరిచిందని పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు.ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement