బ్యాంకు ఖాతాదారులకు మరో గమనిక. ఈ నెలాఖరులో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఆర్బీఐ హాలీడేస్ ప్రకారం.. బ్యాంకులు దాదాపు వారం రోజులు పనిచేయకపోవచ్చు. అయితే ఈ సెలవులు ప్రాంతం ప్రాతిపదికన మారతాయి. మార్చి 27 నుంచి 29 వరకు అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. 27న నాలుగో శనివారం కాగా… 28న ఆదివారం, 29న హోలీ పండుగ. అందువల్ల ఈ మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే మార్చి 30న వర్కింగ్ డే కాగా.. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు. అలాగే ఏప్రిల్ 1న కూడా బ్యాంక్ సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఇక ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 3న వర్కింగ్ డే కాగా ఏప్రిల్ 4 ఆదివారం. అంటే బ్యాంకులు 9 రోజుల్లో దాదాపు 7 రోజులు పనిచేయవని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖాతాదారులు ఇప్పుడే ఏమైనా లావాదేవీలు ఉంటే త్వరపడండి. లేకుంటే అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement