దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమైయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత మూడు రోజులుగా భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం కోలుకుంది. నిన్న దేశీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు భారీగా పతనం అయ్యాయి. ఇవాళ లాభాల బాట పట్టాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో దేశీయ మార్కెట్లలో బుల్ పరుగులు పెట్టింది. సెన్సెక్స్ 1200లకుపైగా పాయింట్ల ప్రాఫిట్తో 55,740 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 333 పాయింట్ల లాభంతో 16,581 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement