హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ఘటనలో రాజేశ్, టీచర్ సుజాత ఇద్దరు కలిసి అలా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వీరిద్దరు ఫోన్లను పరిశీలించిన తర్వాత పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో పలు సంచలన విషయాలను పోలీసులు వెలువరించారు. ఏడాది క్రితం రాజేశ్, టీచర్ సుజాత మధ్య ఓ రాంగ్ పోన్‌కాల్ అనుబంధం పెంచింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరుచుగా కలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. సుజాతపై రాజేశ్ అమితంగా ప్రేమను పెంచుకున్నాడని, దాంతో ఆమె ఎటూ తోచని పరిస్థితుల్లో ఈ డిసిషన్ తీసుకున్నట్టు అవగతం అవుతోంది.
రాజేశ్, టీచర్ సుజాత మధ్య ఏం జరిగింది, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆధారాలు సేకరించారు. దర్యాఫ్తు ఓ కొలిక్కి రావడంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఏడాదిన్నర క్రితం మిస్ట్ కాల్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇల్లిసిట్ రిలేషన్‌కి దారి తీసింది. ఈ నెల 24వ తేదీన చివరిసారిగా కలుసుకొని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని వారు ప్లాన్ చేసుకున్నారు.
అయితే.. అంతకుముందే టీచర్ పేరు మీద హయత్ నగర్ లోని ఓ దుకాణంలో రాజేశ్ పురుగుల మందు కూడా కొనుగోలు చేశాడు. 24వ తేదీని ఇంటికి వెళ్లాక టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఇక.. అదే రోజు రాజేశ్ కూడా పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలో టీచర్ భర్త ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా, రాజేశ్ కూడా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిద్దరి ఫోన్లలో ఉన్న పూర్తి వివరాలతో పోలీసులు కేసును ఛేదించారు.