కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ..రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం కావాలనే తన కోరికని విడిచిపెట్టానన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. నన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు మీరంతా పెద్దసంఖ్యలో నాకు ఓట్లు వేశారు. కానీ హైకమాండ్ మరో నిర్ణయం తీసుకుంది. అగ్ర నేతలు సోనియా, రాహుల్, ఖర్గేలు ఇచ్చిన సూచనకు నేను తలవంచానని డీకే పేర్కొన్నారు. తానిప్పుడు మరింత సహనంతో వేచిచూడాల్సి ఉందని, అయితే మీ ఆకాంక్షలు మాత్రం వృధా కావని స్పష్టం చేశారు.మే 10న జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక సీఎం పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడటంతో ప్రతిష్టంభనను తొలగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నాలుగు రోజుల తీవ్ర తర్జనభర్జనల అనంతరం సిద్ధరామయ్యవైపు మొగ్గుచూపింది. పవర్ షేరింగ్ ఫార్ములాను ప్రతిపాదించి డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం పదవిని అంగీకరించేలా ఒప్పించింది. పవర్ షేరింగ్ ఫార్ములాలో భాగంగా రెండేండ్ల తర్వాత డీకే శివకుమార్ కర్నాటక సీఎం పదవిని చేపట్టనున్నట్టు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement