చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కరోలినా ముకోవా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ ముకోవా 7-6 (7/5), 6-7 (5/7), 7-5తో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ సబలెంకా (బెలారస్)పై సంచలన విజయం సాధించింది. తన కెరీర్‌లో 17వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న 26 ఏళ్ల ముకోవా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
సబలెంకాతో 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్ పోరులో నిర్ణాయక మూడో సెట్‌లో ముకోవా 2-5 స్కోరు వద్ద తన సరీవస్‌లో 30-40 పాయింట్ల వద్ద ఓటమి ముంగిట నిలిచింది. ఈ కీలక తరుణంలో ముకోవా ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో 40-40తో సమం చేసింది.
- Advertisement -