శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని గోవాలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అన్నారు. ఎంజీపీ నేత సుదిన్ ధవలికర్, గోవా ఫార్వర్డ్‌కు చెందిన విజయ్ సర్దేశాయ్, కాంగ్రెస్ నేతలు దిగంబర్ కామత్, గిరీష్ చోడంకర్ ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయి. మహారాష్ట్ర నేతల మొబైల్ ట్యాప్ చేసిన విధానం గోవాలోనూ పునరావృతమవుతోందని సంజయ్ రౌత్ అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫోన్లని ట్యాప్ చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లాపై ఇటీవల ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఆమెపై దక్షిణ ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కోల్బా పోలీస్ స్టేషన్‌లో మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మహారాష్ట్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం (ఎస్‌ఐడీ)కి రష్మీ శుక్లా అధిపతిగా ఉన్నప్పుడు కూడా ఇదే మొబైల్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో, రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది ..కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే మొబైల్ ఫోన్‌ను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై పుణె పోలీసులు రష్మీ శుక్లాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement