Friday, November 22, 2024

పేపర్ లీక్ కారణంగా ఇంటర్ పరీక్ష రద్దు.. నిందితులపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్న సీఎం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఇవ్వాల (బుధవారం) జరగాల్సిన ఇంటర్ మీడియెట్ ఇంగ్లిష్ పరీక్షను రద్దు చేసినట్టు బోర్డు ప్రకటించింది. పేపర్ లీక్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, మిగతా పరీక్షలన్నీ యధావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో తేలిన నివేదికల ప్రకారం.. బల్లియా జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS)ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేశారు. ఇకపై మిగతా జిల్లాల్లో షెడ్యూల్ ప్రకారమే పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. పేపర్ లీక్ కారణంగా ఈరోజు మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు 24 జిల్లాల్లో మాత్రమే జరగాల్సిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ రద్దు చేసినట్టు ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ (UPMSP) తెలిపింది.

ఇక.. పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో పేపర్‌ను లీక్ చేసిన వారిని గుర్తించి కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపాలని ముఖ్యమంత్రి అన్నారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించాలని స్పెషల్ టాస్క్ ఫోర్స్కు సూచించారు. పేపర్ లీక్ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలుంటాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవి కూడా కోరారు.

కాగా, ఆగ్రా, మైన్‌పురి, మథుర, అలీఘర్, ఘజియాబాద్, బాగ్‌పట్, బదౌన్, షాజహాన్‌పూర్, ఉన్నావ్, సీతాపూర్, లలిత్‌పూర్, మహోబా, జలౌన్, చిత్రకూట్, అంబేద్కర్‌నగర్, ప్రతాప్‌గఢ్, గోండా, గోరఖ్‌పూర్, అజంగఢ్, బల్లియా, బల్లియా, బల్లియాలో పరీక్ష రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement