Friday, November 22, 2024

Spl Story: అధ్యక్ష పదవి వద్దంటున్న రాహుల్​.. ఒప్పించేందుకు ట్రైచేస్తున్న సీనియర్​ లీడర్లు!

ఈ నెలాఖరులోగా ​ పార్టీలోని పీసీసీ, ఎఐసీసీ ఎన్నికల ప్రక్రియ ముగించేలా కాంగ్రెస్​ పార్టీ ప్లాన్​ చేస్తోంది. తొలుత పీసీసీ జనరల్ బాడీలో పీసీసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, పీసీసీ ఎగ్జిక్యూటివ్, ఏఐసీసీ సభ్యుల ఎన్నిక ఆగస్టు 20 నాటికి కంప్లీట్​ చేయనున్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20వ తేదీలోగా ముగించాలని భావిస్తున్నారు. కానీ, దీనికి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్​ ముందుకు రాకపోవడం, పార్టీలోని ఇతర సీనియర్లు కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొస్తోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కానుంది. అయితే 2019లో తన పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తిరిగి ఆ బాధ్యతలు స్వీకరించడంపై ఇంకా స్పష్టత రావడం లేదు. దీంతో ఇతరుల పేర్లను కూడా అధ్యక్షుడి కోసం పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర విభాగాలతో వరుస సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో దేశంలోని ప్రతి జిల్లాలోనూ పర్యటించాలని ​ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. దేని విషయంలోనూ క్లారిటీ లేకుండా పోతోందని.. ఏదీ ముందుకు సాగడం లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు కూడా అధ్యక్షుడి రేసులో ప్రచారంలో ఉంది. కాగా, ఆయన మాత్రం రాష్ట్రం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని చెబుతున్నారు. కానీ, రాహుల్ ఆ స్థానాన్ని గాంధీయేతర వ్యక్తి తీసుకోవాలని పట్టుబట్టడంతో పార్టీ నేతలు డైలామాలో పడ్డారు. రాహుల్‌గాంధీకి సన్నిహితంగా ఉండే నేతలు కొంతమంది ఆయన్ను మళ్లీ ఆ పదవి చేపట్టాలని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని చాలాసార్లు విజ్ఞప్తి చేసినా ఆయన విముఖత వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని సభ్యులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని సీనియర్ నేత అంబికా సోనీ అన్నారు. పార్టీ అంతర్గత ఎన్నికలకు సీడబ్ల్యూసీ ఆమోదముద్ర వేసింది. సంస్థాగత ఎన్నికలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపి షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

- Advertisement -

పీసీసీ జనరల్ బాడీలో పీసీసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, పీసీసీ ఎగ్జిక్యూటివ్, ఏఐసీసీ సభ్యుల ఎన్నిక ఆగస్టు 20 నాటికి ముగియనుంది. ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ప్రాథమిక సెషన్‌లో (తేదీ తరువాత ప్రకటిస్తారు) AICC సభ్యులచే CWC సభ్యులు, ఇతర సంస్థల ఎన్నిక సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement