రాజకీయ నాయకులు సినిమాల్లో నటించడం కొత్తేమి కాదు…అలాగే సినిమా వారు రాజకీయాల్లోకి వెళ్ళడం మామూలే. కాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నటుడిగా మారబోతున్నారట. అద్దంకి సరసన సీనియర్ నటి ఇంద్రజ నటిస్తుంది. ఈ చిత్రాన్ని బొమ్మకు మురళి దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారట. . బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలు ఈ మూవీలో ఉంటాయని అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ మూవీని సినీ బయోపిక్ గా తీస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు అద్దంకి దయాకర్ రావు చెప్పారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని వివరించారు. మిగతా నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..