Sunday, November 10, 2024

ఇజ్రాయెల్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. వ‌చ్చే ఏడాది రోడ్డెక్క‌నున్న ఎలక్ట్రిక్ టాక్సీలు..

జీరో రోడ్ యాక్సిడెంట్స్‌, కాలుష్య ర‌హిత వాహ‌నాల‌పై ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ చూపుతున్న‌ట్టు ఇజ్రాయెల్‌ ప్ర‌భుత్వం తెలిపింది. ఈ క్ర‌మంలో పార్లమెంటు ఆర్థిక వ్యవహారాల కమిటీకి రవాణా మంత్రిత్వ శాఖ కొన్ని ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించింద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. అవి ఆమోదం పొంద‌డంతో అటాన‌మ‌స్ సెక్టార్ కింద ఎల‌క్ట్రానిక్ వాహ‌నాలు, డెవ‌ల‌ప్ మెంట్ వంటివి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌నున్నాయి. తొలుత ఇది ట్యాక్సీల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

కాగా, వచ్చే ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా ఎల‌క్ట్రానిక్ ట్యాక్సీలు అందుబాటులోకి తెచ్చేలా ప్ర‌తిపాదించిన‌ ముసాయిదా చట్టాన్ని అక్క‌డి పార్ల‌మెంట్ ఆమోదించింది. పార్లమెంటు ఆర్థిక వ్యవహారాల కమిటీకి సమర్పించిన ప్రతిపాదిత రవాణా మంత్రిత్వ శాఖ చట్టం ఇజ్రాయెల్‌లో స్వయంప్రతిపత్త రంగాన్ని ఏర్పాటు చేసింది.

జీరో యాక్సిడెంట్స్‌, క‌ర్బ‌న ఉద్ఘారాలు లేనివిధంగా.. రద్దీని తగ్గించే లక్ష్యంతో 640 ఇజ్రాయెలీ స్టార్టప్‌లు ఇప్పటికే అటాన‌మ‌స్‌ విభాగంలో పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖలోని అధికారి అవ్నర్ ఫ్లోర్ తెలిపారు. “రాబోయే దశాబ్దంలో, ఈ వాహనాలు ప్రధానంగా ప్రజా రవాణా కోసం ఉపాయోగిస్తాం. ప్రైవేట్ వాహనాలకు తక్కువగా కేటాయిస్తాం” అని ఆయన చట్టసభ సభ్యులతో అన్నారు.

కెమెరాలు, సెన్సార్‌లతో కూడిన సుమారు 40 సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు ఇప్పటికే ఇజ్రాయెల్ రోడ్లపై ఉన్నాయని.. ప‌లు కంపెనీలు వాటిని టెస్ట్ చేస్తున్నాయని, ఆ త‌ర్వాత ఆమోద ప్రక్రియ ఉంటుంద‌ని ఫ్లోర్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే సెల్ఫ్ డ్రైవింగ్ షటిల్ ఆపరేషన్ ప్రారంభమవుతుందని, ఈ రంగంలో ఇజ్రాయెల్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్ మెంట్ (ఆర్ అండ్ డి) టాక్సీ డ్రైవర్లకు పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement