రూ.11 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 12మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘన చిత్తూరు జిల్లాలోని వేర్వేరు చోట్ల జరిగాయి.ఎర్రచందనం స్మగ్లింగ్ అనూహ్యంగా ఊపందుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ దాడులు చేపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దసంఖ్యలో ఎర్రచందనం చెట్లు ఉండటంతో అక్కడినుంచి తమిళనాడుకు స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు జిల్లా నలువైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కాగా నిందితులను తమిళనాడుకు చెందిన గోవింద్‌సామి సేథు (44), మురుగేశన్ (50), పెరుమాళ్ వెంకటేష్ (44), కరియ రామన్ (27), కలంజన్ (36), వెంకటేష ఆర్ (37), గోవింద రాజులు (21)గా గుర్తించారు. మరో ఘటనలో తిరుపతి నుంచి చిత్తూరు వెళుతున్న మినీ గూడ్స్ వ్యాన్‌ను అడ్డగించిన పోలీసులు రూ 4 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. ఈ ఘటనలో దేవన్ అలియాస్ నాగరాజ్, వైద్యలింగం అలియాస్ సారంగపాణి, నజీర్ భాషా, నానీ అలియాస్ ముత్తురామన్‌ను అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్‌కు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న సెంథిల్ కుమార్ పరారీలో ఉన్నాడు. సెంథిల్ కుమార్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement