ఒంటిమిట్ట .. ప్రభ న్యూస్ : శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జేఈవో వీరబ్రహ్మం తలంబ్రాలను డిప్యూటీ ఈఓ రమణప్రసాద్ కు అందజేశారు. అక్కడినుండి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు.. 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను ప్యాకెట్లను తయారు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి ఏఈఓ ధనుంజయ్ లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement