వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతున్నందు వల్ల ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఏపీలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామన్నారు. విజయవాడ దేవినగర్ వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విద్యుత్ కోతల నివారణకు అవసరమైతే ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు అందజేస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మంజూరైన సబ్‌స్టేషన్లలో మూడింటి పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఆటంకాలను తొలగించేందుకు నిధుల సమస్య రాకుండా ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..