ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో భద్రతా వైఫల్యం బయటపడింద. ఇవ్వాల (ఆదివారం) రాత్రి జరిగిన ఓ ప్రచార యాత్రలో మోదీపైకి ఓ వ్యక్తి సెల్‌ఫోన్ విసిరేశాడు. ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓపెన్ టాప్ వాహనంపై మొబైల్ ఫోన్ విసిరివేయడంతో భద్రతా ఉల్లంఘన జరిగినట్టు తెలుస్తోంది. వాహనంపైకి సెల్ ఫోన్ విసిరేయగా.. దూసుకెళ్లిన ఫోన్‌కు కొన్ని అంగుళాల దూరంలోనే మోదీ ఉన్నారు. కర్నాటకలోని మైసూరులో రోడ్‌షో సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement