తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు రూ. 15 కోట్లు సుఫారీ ఇచ్చారని రెండు రోజుల క్రితం ఈ విషయమై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు. రెండు రోజుల క్రితం మంత్రిని హత్య చేయాలని కుట్ర వెలుగు చూడడంతో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలని కుట్ర వెలుగు చూడడంతో మంత్రికి సెక్యూరిటీని పెంచాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ కు భద్రతను పెంచారు. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఒక పైలెట్ వాహనంతో పాటు 10 మందితో భద్రతను కల్పిస్తున్నారు. హత్య చేయాలనే కుట్ర బయటకు రావడంతో పోలీసు శాఖ భద్రతను పెంచింది. రెండు పైలెట్ వాహనాలతో పాటు 20 మంది సెక్యూరిటీ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital