Tuesday, November 26, 2024

Security alert : రిపబ్లిక్ డే టార్గెట్.. ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులకు ముప్పు..

రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులకు టెర్రర్ థ్రెట్ ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది పేజీల నివేదకను హైలీ సీక్రెట్గా అందజేసింది. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోడీ, ఇతర ప్రముఖుల ప్రాణాకు ముప్పు ఉందని ఆ నివేదికలో ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.

ఈసారి మధ్య ఆసియా దేశాలైన – కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ -నాయకులను గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించే అవకాశం ఉంది. కాగా, పాకిస్థాన్/ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతానికి చెందిన గ్రూపుల నుంచి ముప్పు ఉండొచ్చన్న సమాచారం వచ్చిందని ఆ నోట్ లో ఇంటెలిసెన్స్ పేర్కొంది. ఈ విచ్చిన్నకర శక్తులు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను టార్గెట్గా చేసుకుని.. బహిరంగ సభలు, కీలకమైన సమావేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో పేలుళ్లు, విధ్వంసానిక పాల్పడడం వంటి చర్యలకు ఉపక్రమించే ప్రమాదం ఉందని ఆ నివేదికలో వెల్లడించారు.

డ్రోన్‌లను ఉపయోగించి కూడా దాడులకు ప్రయత్నించవచ్చు..
లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రర్ గ్రూపులు ఈ ఉగ్ర ముప్పు వెనుక ఉన్నాయని ఇంటెలిజెన్ హైలీ ఇన్‌పుట్ పేర్కొంది. పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని మొబిలైజ్ చేయడం, రీయాక్టిక్ చేస్తూ కేడర్‌లను కూడా సమీకరించుకుంటున్నాయని ఇన్‌పుట్ తెలిపింది. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వారి టార్గెట్ ప్రకారం దాడులకు ప్లాన్‌ చేస్తున్నారని నివేదకలో ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement