ఢిల్లీ జహంగీర్ పురలో 144సెక్షన్ అమలులో ఉంది. భారీగా రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. నిన్న హనుమాన్ శోభయాత్రలో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి ఘటనలో గాయపడ్డ 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. రాళ్ళు రువ్విన ఘటనలో పోలీసులతో పాటు పౌరులు కూడా గాయాలపాలయ్యారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసు అధికారులతో మాట్లాడిన కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా. సీఎం అరవింద్ కేజ్రివాల్ పరిస్థితిని ఆరా తీశారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మసీద్ వద్దకు చేరుకోగానే మొదలైన చిన్న గొదవ తరువాత పెద్దగా మారింది. ఇరువర్గాలు రాళ్ళు రువ్వుకున్నాయి. ప్రజలంతా సమన్యయం పాటించాలని,దుష్ప్రచారాలను, వదంతులను నమ్మొద్దని పోలీసులు కోరారు.
మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణకు అమన్కమిటీలతో ఆదివారం పోలీసు అధికారులు భేటీ అయ్యారు. ప్రజలను శాంతియుతంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేయాలని కమిటీ సభ్యులను పోలీసులు కోరారు. కమిటీ సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉండాలని..ఏ ప్రాంతంలోనైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు అమన్కమిటీలను కోరారు.
ఢిల్లీ జహంగీర్ పురలో 144సెక్షన్ – పోలీసుల అదుపులో 14మంది
Advertisement
తాజా వార్తలు
Advertisement