Tuesday, November 26, 2024

Flash: బోధన్‌లో 144 సెక్షన్.. శివాజీ విగ్రహం వద్ద ప్రత్యేక పికెటింగ్

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునివ్వడంతో ఆందోళనకారులను ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పట్టణ వాసులు గుమిగూడకుండ పోలీసులు చర్యలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. సభలు, సమావేశఆలపై నిషేదం విధించారు.

శివాజీ విగ్రహాన్ని నెలకొల్పిన అంబేద్కర్ చౌరాస్తాలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్దకు ఎవరూ రాకుండా రహదారిలో పోలీసులు అడ్డుకుని, వాహనదారులను వెనక్కి తిప్పి పంపుతున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో వ్యాపార సముదాయాలను మూసి ఉంచారు. రాజకీయ పార్టీల నేతలు బోధన్ లోకి ప్రవేశిస్తే అరెస్ట్ చేస్తామని సీపీ స్పష్టం చేశారు. నిన్నటి ఘర్షణలో 10 మందిని అరెస్ట్ చేయగా.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

బోధన్‌లో ఆదివారం(మార్చి 20) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీ రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఘర్షణకు కారణమైంది. బోధన్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శనివారం(మార్చి 19) రాత్రి ఓ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఓ వర్గం వారు.. విగ్రహాన్ని తొలగించాలంటూ అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో మరో వర్గం వారు కూడా వందలాదిగా అక్కడికి వచ్చారు. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం రాళ్ల దాడికి దారి తీసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్‌ తీర్మానం ఉందని, విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాలు ఎదురెదురుగా టెంట్లు వేసుకుని ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఏసీ పీ రామారావు ఇరువర్గాలను సముదాయించేందు కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  నినాదా లు చేస్తూ ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకారులు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సీపీ లాఠీచార్జికి ఆదేశించడంతో ప్రత్యేక బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయువును ప్రయోగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement