Saturday, November 23, 2024

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు.. ఫలితాలు ఎప్పుడంటే..

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష ప్రకటించారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో అధికారులతో మంత్రి సబితా సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారు. కరోనా వల్ల విద్యా రంగం పూర్తిగా దెబ్బతిందని మంత్రి అన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందించి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఫలితాల వెల్లడి కోసం కమిటీ వేసినట్లు చెప్పారు. కమిటీ నివేదిక అందిన అనంతరం ఫలితాలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

అయితే, పరీక్షల రద్దు అంశంపై ప్రభుత్వం ప్రకటనతో విద్యార్థులు ఆయోమయానికి గురైయ్యారు. తొలుత ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, మంత్రి సబితా రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలని పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. అయితే, అధికారులతో సమీక్ష అనంతరం విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల రద్దును ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా, ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థుల‌ను ప‌రీక్ష‌లు లేకుండానే ప్ర‌మోట్ చేసిన విష‌యం తెలిసిందే. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సర్కారు…. తాజాగా ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: 30 శాతం పీఆర్సీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం

Advertisement

తాజా వార్తలు

Advertisement