Tuesday, November 26, 2024

226ప‌రుగుల‌కే ‘సౌత్ ఆఫ్రికా’ ఆల్ ఔట్

భార‌త బౌల‌ర్లు ఇర‌గ‌దీశారు. సౌత్ ఆఫ్రికాలో రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్ మెన్ ల‌ను స్వ‌ల్ప స్కోర్ కే పెవిలీయ‌న్ కు పంపుతూ 226ప‌రుగుల‌కే ఆలౌట్ చేయ‌డం విశేషం. భార‌త్ పేస‌ర్ శార్ధుల్ ఠాకూర్ 7 వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేయ‌డంలో కీలక పాత్ర వ‌హించాడు. అలాగే మ‌హ్మ‌ద్ ష‌మీ రెండు బుమ్రా ఒక వికెట్లను ద‌క్కించుకున్నారు. కాగ శార్ధుల్ ఠాకూర్ కేవ‌లం 17.5 ఓవ‌ర్ల‌లోనే 7 వికెట్లను ప‌డ‌కొట్టి కేరీర్ లోనే బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌నను చూపాడు. భార‌త బౌల‌ర్ల దాటికి ఐదుగురు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్ లు సింగిల్ డిజిట్ స్కోర్ కే ప‌రిమితం అయ్యారు. అందులో ఇద్ద‌రు జీరో ప‌రుగుల‌కే వెనుతిరిగారు. అలాగే మ‌రో ఇద్ద‌రుఒక‌ ర‌న్ మాత్ర‌మే చేశారు. అయితే కీగ‌న్ పీట‌ర్సన్ (62) తో పాటు సౌత్ ఆఫ్రికా వికెట్ కీప‌ర్ వెర్రేన్నే (51) ప‌రుగులు చేశారు. దీంతో 200 మార్క్ ను సౌత్ ఆఫ్రికా దాటింది. టీమిండియా మొద‌టి ఇన్నింగ్స్ లో 202 పరుగులు మాత్ర‌మే చేసింది. దీంతో సౌత్ ఆఫ్రికా కే 24 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. అయితే ప్ర‌స్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కాగ ఇది రెండో రోజు కావ‌డంతో ఈ టెస్టు ఫ‌లితం ఎవ‌రికి వ‌స్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement