తెలంగాణలో సంచలనం రేపిన పాల్వంచ ఆత్మహత్య కేసులో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. బాధితుడు రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. రాఘవతో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానంటూ పలు వివరాలను ఆయన వీడియోలో చెప్పారు. తన బలవన్మరణానికి సూత్రధారి రాఘవేనని రామకృష్ణ ఆరోపించారు. వారి కారణంగా ఎంతో క్షోభ అనుభవించానని చెప్పారు. వాటాలు పంచకుండా పరిస్థితిని చావుదాకా తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారని అన్నారు. తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయవద్దని రామకృష్ణ వేడుకున్నారు.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే నిందితుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ చేశారు. వనమా రాఘవను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. దమ్మపేట పోలీసులు మందలపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆంధ్రా ప్రాంతం నుంచి కారులో వస్తున్న రాఘవతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకుడు గిరీశ్, కారు డ్రైవర్ మురళిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను పాల్వంచ స్టేషన్లో విచారణ అధికారి విచారణ అధికారి ఏఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవ అరెస్ట్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. నాగ రామకృష్ణ బామ్మర్ది జనార్దన్ ఫిర్యాదు మేరకు వనమా రాఘవపై ఐపీసీ 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital