తెలంగాణలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇవాళ్టి నుంచి టీకాలు ఇస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండోడోస్ వ్యాక్సినేషన్‌ను మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను నిన్న ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement