న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచం హడలెత్తిపోతోంది. ఒమిక్రాన్ జాతికి చెందిన జన్యువును డీకోడ్‌చేసి, దాని వ్యాప్తి తీవ్రత అనేషణకు అన్ని దేశాలు పరుగులు తీసుస్తున్నాయి. డెల్టా విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మిలియన్ల మంది జీవితాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లిd ప్రమాదం అంచుల్లోకి వెళ్లింది. ఈ వేరియంట్‌ను ద.ఆఫ్రికాలో గుర్తించిన 72 గంటల్లోనే హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియంలో కేసులు నమోదవడం కలవరం కలిగిచింది. మిగతా దేశాల్లోనూ కొత్త వేరియంట్ కేసులు ఉండొచ్చన్న ఆందోళనలు రేకెత్తించింది. యూకేతోపాటు మిగతా ఐరోపా దేశాలు, జపాన్ సహా డజను దేశాలలో ఒమిక్రాన్ గుర్తించబడింది.
ఆ తర్వాత ద.ఆఫ్రికా నుంచి అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా మొజాంబిక్, నెదర్లాండ్స్‌కూ ఈ వేరియంట్ వ్యాప్తిచెందింది. సెకండ్ వేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన భారత్, చైనా, అమెరికా దేశాలు ఇంకా ఒమిక్రాన్ బారినపడలేదు. మునుపటి అనుభవాల దృష్ట్యా మనదేశం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠిన స్క్రీనింగ్ నిబంధనలు చేపట్టింది. అయితే, భారత ప్రభుత్వ ఆధర్యంలోని ఐసీఎంఆర్‌లో పనిచేసే వైద్యుడు ఒకరు ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ ఉన్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన వేరియంట్ల కంటే ఇది మరింత ప్రాణాంతకమని, వ్యాక్సిన్లను తప్పించుకోగదలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వ్యాక్సిన్లు కొత్త వైరస్‌ను ఎదుర్కోగలవో లేదో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నాలు తీవ్రంచేశారు.
దీనిపై కచ్చితమైన అవగాహనకు రావడానికి నాలుగువారాలు పట్టవచ్చని ద.ఆఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ యాక్టింగ్ హెడ్ అడ్రియన్ ప్యూరెస్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత ప్రమాదకారిగా ప్రకటించడం ద్వారా ప్రపంచానికి హెచ్చరిక చేసింది. విదేశీ ప్రయాణికులు, పర్యాటకులకు కోవిడ్ సోకినట్లు తేలితే వెంటనే వారి నమూనాలను జీనోమ్ సీకెన్సింగ్‌కు పంపుతున్నారు. అదేవిధంగా దేశీయంగానూ కరోనా టెస్టులను మళ్లిd వేగవంతం చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.
ద.కొరియా, నైజీరియాలో ఒమిక్రాన్ కేసులు
కరోనా కొత్త వేరియంట్ మరో రెండు దేశాలకు వ్యాప్తిచెందింది. దక్షిణకొరియాతోపాటు, నైజీరియాలోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. నైజీరియా నుంచి వచ్చిన దంపతులకు ఒమిక్రాన్ సోకినట్లుతేలింది. వీరు రెండు డోసులు టీకా తీసుకున్నవారే. వీరితోపాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులు, వారి స్నేహితుడూ మహమ్మారి బారినపడ్డారు. దేశంలో రోజువారి కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సగటున 5వేలకుపైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి అని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కేడీసీఏ) అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అలాగే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా నైజీరియాలోకి ఒమిక్రాన్ వ్యాప్తిచెందింది. మొదటి కేసును గుర్తించారు.