నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల స్ట్రూటినీ పూర్తయ్యింది. ఈ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేస్తున్నాయి. ఇంకా చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటన్నిటినీ పరిశీలించిన ఎన్నికల అధికారులు నామినేషన్స్ కోసం అందించిన ధ్రువీకరణ పత్రాల్లో సరైన ఆధారాలు, వివరాలు చూపని అభ్యర్థుల వివరాలు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక కోసం మొత్తం 130 మంది అబ్యర్థులు 199 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాగా, వీటిలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 83 అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయి. ఇక.. ఎల్లుండి అంటే సోమవారం సాయంత్రం 3 గంటలకు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలు తెలియనున్నాయి.