Monday, November 25, 2024

మండుతున్న ఎండ‌లు.. పుదుచ్చేరిలో పాఠ‌శాల‌ల‌కి సెల‌వులు పొడిగింపు

జూన్ నెల వ‌చ్చినా ప‌లు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. అంతేకాదు జూన్ నెల‌లో కూడా ఎండ‌లు మండిపోతాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించడంతో జ‌నం భ‌య‌ప‌డుతున్నారు. కాగా త్వరలో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు, విద్యా సంస్థలు తెరచుకోనున్నాయి. అయితే ఎండలు మండిపోతుండటంతో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలు సెలవులను పొడిగించాలని చూస్తున్నాయి. దీనిలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సైతం తన పరిధిలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి అన్ని స్కూల్స్ పున: ప్రారంభం కావాల్సి వుండగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో సెలవులను పొడిగించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో జూన్ 7 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. దీనితో పాటు పుదుచ్చేరిలో వున్న 127 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేసేందుకు అనుమతులు లభించాయని చెప్పారు. ఇప్పటికే విద్యార్ధులకు ఉచిత యూనిఫాం, సైకిళ్ల పంపిణీ పూర్తయ్యిందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement